బొడ్డు శ్రీనివాస్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!

బొడ్డు శ్రీనివాస్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!
x
Highlights

నల్లగొండ పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ హత్య కేసును డీల్ చేస్తున్న...

నల్లగొండ పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ హత్య కేసును డీల్ చేస్తున్న నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్న రాత్రి నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్న సీఐ వెంకటేశ్వర్లు వెపన్‌‌ను డ్రైవర్‌కి, డిపార్ట్‌మెంట్‌ సిమ్‌‌ను మాడుగుల పీఎస్‌లో అప్పగించాడు. కాంగ్రెస్ లీడర్‌ బొడ్డుపల్లి శ్రీనివాస్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌ రమేష్‌ హత్య కేసుల్లో ఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కీలక కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ మాయమైపోయవడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలవరం చోటు చేసుకుంది. తన భర్త హత్య కేసును సీబీఐకి కానీ, ప్రత్యేక దర్యాప్తు సంస్థకు కానీ ఇవ్వాలంటూ బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. కానీ నల్లగొండ ఎస్పీ మాత్రం ఈ హత్య చిల్లర పంచాయితీ కారణంగా జరిగింది తప్ప రాజకీయ కుట్ర కోణం లేదని వెల్లడించారు.

ఈనెల 24వ తేదీన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిన నాటి నుంచి ఈ హత్య కేసు విషయమై ఇటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాటల యుద్ధం చేస్తోంది. హత్యకు అధికార పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్ విమర్శించగా.. సొంత పార్టీవారే శ్రీనివాస్‌ను హత్య చేశారని టీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. తుదకు కేసు కోర్టుకు చేరి.. కోర్టు జోక్యం చేసుకున్న తరుణంలో ఉన్నఫలంగా సీఐ మాయమైపోవడం పెద్ద దుమారమే రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories