గవర్నర్‌పై ఆరోపణలు.. జర్నలిస్ట్‌ అరెస్ట్‌

గవర్నర్‌పై ఆరోపణలు.. జర్నలిస్ట్‌ అరెస్ట్‌
x
Highlights

తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌పై అభ్యంతరమైన వార్త ప్రచురించారన్న ఆరోపణలపై ప్రముఖ తమిళ వీక్లీ నక్కీరన్ ఎడిటర్ ఆర్ ఆర్ గోపాల‌్‌‌ను పోలీసులు అరెస్ట్...

తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌పై అభ్యంతరమైన వార్త ప్రచురించారన్న ఆరోపణలపై ప్రముఖ తమిళ వీక్లీ నక్కీరన్ ఎడిటర్ ఆర్ ఆర్ గోపాల‌్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌భవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో గోపాల్‌ను అరెస్ట్ చేశారు. పరీక్షల్లో మంచి మార్కులతో పాటు బంగారు భవిష్యత్ కావాలనుకునే విద్యార్థునులు తాను చెప్పినట్లుగా వినాలని ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలని చెప్పిన విరుద్‌నగర్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవికి గవర్నర్ కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు నక్కీరన్‌‌ లో కథనాలు వచ్చాయి. రాజ్‌భవన్ ప్రతిష్టకు భంగం కలిగేలా కథనాలు ఉన్నాయంటూ గవర్నర్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం చెన్నై నుంచి పుణె వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories