logo
సినిమా

త్వరలోనే వీళ్లందరి దూల పవన్‌ తీర్చుతాడు : నాగబాబు

X
Highlights

సెలైంట్‌గా ఉన్నామ్‌ కదా అని.... ఏం మాట్లాడినా పడతామనుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చారు నాగబాబు. తమ జోలికి రావొద్దంటూ ...

సెలైంట్‌గా ఉన్నామ్‌ కదా అని.... ఏం మాట్లాడినా పడతామనుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చారు నాగబాబు. తమ జోలికి రావొద్దంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. సాఫ్ట్‌ టార్గెట్‌ అనుకొని మెగా ఫ్యామిలీ మెంబర్స్‌పై రాళ్లు వేయొద్దన్న నాగబాబు తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఇకపై ఎలా రియాక్ట్‌ అవుతామో తెలియదన్నారు. తమ సహనాన్ని ఓర్పుని చేతగానితనంగా తీసుకోవద్దన్నారు. తన హెచ్చరికల్ని అంత ఈజీగా తీసుకోవద్దన్నారు. తల్లిని అంటే ఎవరైనా భరిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తంచేసిన నాగబాబు ఆడపిల్ల కాబట్టే వదిలేశామన్నారు.

పవన్‌ కల్యాణ్‌ తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యమున్న మగాడన్నారు నాగబాబు. ఆ ధైర్యం మీకుందా అంటూ ప్రత్యర్ధులకు సవాలు విసిరారు. మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తోన్న వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారో ఏఏ రాజకీయ శక్తులు ఉన్నాయో తమకు తెలుసన్నారు. అతిత్వరలోనే పవన్‌ కల్యాణ్‌ వాళ్లందరి దూల తీర్చడం ఖాయమన్నారు. చూసుకోండని తమ అభిమానులకు ఒక్కసారి చెబితే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు.

Next Story