పవన్ కల్యాణ్‌తో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ

పవన్ కల్యాణ్‌తో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ
x
Highlights

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. విజయవాడలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కొత్తింట్లో భేటీ అయ్యారు. అరగంట పాటు ఇద్దరూ సమావేశమయ్యారు. ఏపీలో నెలకొన్న తాజా...

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. విజయవాడలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కొత్తింట్లో భేటీ అయ్యారు. అరగంట పాటు ఇద్దరూ సమావేశమయ్యారు. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నాలుగు రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్ తో పాటు, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇంతలోనే పవన్ తో మనోహర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలతో పాటు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు మనోహర్ దూరంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories