శ్రీదేవి డెడ్‌బాడీ తరలింపుపై సస్పెన్స్‌

శ్రీదేవి డెడ్‌బాడీ తరలింపుపై సస్పెన్స్‌
x
Highlights

శ్రీదేవి మృతిదేహం...భారత్‌కు తరలింపుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన వెంటనే డెడ్‌బాడీని తరలించేందుకు క్లియరెన్స్‌ వచ్చిందని...

శ్రీదేవి మృతిదేహం...భారత్‌కు తరలింపుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన వెంటనే డెడ్‌బాడీని తరలించేందుకు క్లియరెన్స్‌ వచ్చిందని యుఏఈ రాయబారి నవదీప్‌ సూరి తెలిపారు. అయితే అంతలోనే సీన్‌ మారిపోయింది. శ్రీదేవి నటమునిగి చనిపోయారని తెలియడంతో కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారని ఈ కారణంగా మృతదేహం తరలింపు మరింత ఆలస్యమవుతుందని నవదీప్‌ సూరి వెల్లడించారు. వీలైనంత త్వరగా డెడ్‌బాడీని ఇండియాకు తరలించేందుకు అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు.

దుబాయ్ చట్టాల ప్రకారం హాస్పిటల్‌ బయట ఎవరు చనిపోయినా తప్పనిసరిగా పోస్టుమార్టం, ఫోరెన్సిక్ టెస్ట్‌లు నిర్వహించాల్సిందే. హోటల్ గదిలో శ్రీదేవి మృతి చెందడంతో పోస్టుమార్టం, ఫోరెన్సిక్ టెస్ట్‌లు యథావిధిగా కొనసాగుతుంది. పోస్టుమార్టం నివేదికలో అనుమానాస్పదంగా నీటమునిగి చనిపోయినట్లు వెల్లడవడంతో కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌‌కు అప్పగించారు. ఇదంతా న్యాయ విధానాల్లో సహజమే. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ టెస్ట్‌ల రిపోర్ట్‌లను ప్రాసిక్యూటర్లు సమీక్షిస్తారు. తర్వాత శ్రీదేవి డెడ్‌బాడీని బంధువులకు అప్పగిస్తారు. కేసులో ఏదైనా అనుమానాస్పదంగా ఉందని అనిపిస్తే ప్రాసిక్యూటర్లు విస్త్రతంగా విచారణ జరుపుతారు.


ప్రాథమిక విచారణ ప్రకారం శ్రీదేవి స్పృహకోల్పోయిన అనంతరం బాత్‌టబ్‌లో పడి చనిపోయారని దుబాయ్‌ పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో...రక్తంలో మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. అటు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో శ్రీదేవి బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయారంటూ తేలింది. అయితే ఘటనకు ముందు గదిలో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గదిలో ఎవరెవరున్నారు ? ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories