టీడీపీలో విషాదం.. ప్రఖ్యాత విద్యావేత్త దుర్మరణం..

టీడీపీలో విషాదం.. ప్రఖ్యాత విద్యావేత్త దుర్మరణం..
x
Highlights

టీడీపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికాలో జరిగిన...

టీడీపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి… కాలిఫోర్నియా నుంచి అలస్కా వెళ్లే ప్రాంతంలోని వైల్డ్‌ లైఫ్‌ సఫారీకి వెళ్తుండగా…అయన ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్‌ కు గురైంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురు ఉండగా… వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మూర్తి.. కూడా మృతిచెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తానా ప్రతినిధులు హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. కాగా ఎంవీవీఎస్‌ మూర్తి నందమూరి బాలకృష్ణకు దగ్గరి బంధువు, తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా పేరుంది. ప్రఖ్యాత గీతమ్‌ విద్యాసంస్థలకు ఆయన అధినేత. అలాగే గతంలో విశాఖపట్టణం ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. మూర్తి దుర్మరణంతో టీడీపీతో పాటు, గీతం యూనివర్సిటీలో తీవ్ర విషాదం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories