అయన మృతి నాకు పెద్ద లోటు : ఎమ్మెల్యే పంచకర్ల

అయన మృతి నాకు పెద్ద లోటు : ఎమ్మెల్యే పంచకర్ల
x
Highlights

ఇవాళ అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్‌ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌...

ఇవాళ అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్‌ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి… అలాస్కాలోని వైల్డ్‌ లైఫ్‌ సఫారీని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. అక్కడికక్కడే కన్నుమూశారు. ఆయనతోపాటు మరో నలుగురు కూడా దుర్మరణం పాలైనట్టు తెలుస్తుండగా.. ఎంవీవీఎస్‌ మూర్తి ఇక లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు అయన శిస్యుడు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. తనకు రాజకీయ బిక్ష పెట్టిన గురువు ఇక లేరంటే నమ్మలేక పోతున్నానని.. అన్నారు. అయన మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు పెద్దలోటని అన్నారు. కాగా రేపు ఎంవీవీఎస్‌ మూర్తి పార్ధీవదేహం హైదరాబాద్ కు చేరే అవకాశం ఉంది. అక్కడినుంచి నేరుగా విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, బంధువులు సందర్శనార్ధం ఉంచే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories