logo
ఆంధ్రప్రదేశ్

రేపు విశాఖకు చేరుకోనున్న ఎంవీవీఎస్ మూర్తి పార్థివదేహం

రేపు విశాఖకు చేరుకోనున్న ఎంవీవీఎస్ మూర్తి పార్థివదేహం
X
Highlights

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ చైర్మన్ ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికకాయం ఆదివారం ఉదయం 8...

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ చైర్మన్ ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికకాయం ఆదివారం ఉదయం 8 గంటలకు విశాఖకు చేరుకుంటుందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం నివాసంలోనే ఉంచుతామన్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గీతం విశ్వవిద్యాలయం సమీపంలోని స్మృతి వనంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా అమెరికాలోని అలస్కా వైల్డ్ లైఫ్ సఫారీ సందర్శనార్ధం వెళ్లిన మూర్తి బృందం దురదృష్టవశాత్తు దుర్మరణం పాలయ్యారు. మూర్తితో పాటు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి పార్ధివదేహాలు వారి స్వస్థలాలకు రేపు చేరుకోనున్నాయి.

Next Story