వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా
x
Highlights

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో హైకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి వ్యవహారంపై CISF అందజేసిన నివేదికను కేంద్రం...

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో హైకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి వ్యవహారంపై CISF అందజేసిన నివేదికను కేంద్రం హైకోర్టుకు నివేదించింది. విచారణ సందర్భంగా సీల్డ్‌ కవర్‌లోని నివేదికను పరిశీలించిన న్యాయస్ధానం అసమగ్రంగా ఉండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో మరోసారి నివేదికను సమర్పించాలంటూ ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించిన సంగతి తెల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories