నగరంలో ముజ్రా పార్టీ.. మద్యం మత్తులో ఉన్న యువతి, బాలికపై లైంగికదాడి

నగరంలో ముజ్రా పార్టీ.. మద్యం మత్తులో ఉన్న యువతి, బాలికపై లైంగికదాడి
x
Highlights

హైదరాబాద్‌లో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. పోష్ కల్చర్ పేరుతో నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు...

హైదరాబాద్‌లో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. పోష్ కల్చర్ పేరుతో నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు కొందరు బడా బాబులు. తాజాగా కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న లాడ్జిపై దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువతులు, ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. కాగా ఈ పార్టీలో ఓ యువతిపై అత్యాచార యత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. అలాగే మద్యం మత్తులోని మైనర్‌ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన పాతబస్తీ అనుమానితుడు ఖుద్దూస్‌పై నిర్బయ చట్టం కింద కేసు నమోదయింది. మిగతా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories