బెజవాడలో అడుగుపెట్టిన ‘ముజ్రా’..

బెజవాడలో అడుగుపెట్టిన ‘ముజ్రా’..
x
Highlights

అమరావతి రాజధాని అయిన తరువాత విజయవాడ పూర్తిగా మారిపోయింది పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు ఐనాక్స్ థియేటర్లతో నగరం కొత్తగా కనిపిస్తోంది. ఇక గాలి కోసం...

అమరావతి రాజధాని అయిన తరువాత విజయవాడ పూర్తిగా మారిపోయింది పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు ఐనాక్స్ థియేటర్లతో నగరం కొత్తగా కనిపిస్తోంది. ఇక గాలి కోసం డోర్స్ తెరిస్తే గాలితో పాటు దుమ్ము వచ్చినట్లు అభివృద్ధే కాదు ఇంతకాలం నగర వాసులకు తెలియని పబ్ కల్చర్ కూడా నగరంలోకి చాపకింద నీరులా వ్యాపించింది.

పబ్, వీకెండ్ పార్టీలు అక్కడితో ఆగకుండా కొత్తగా ముజ్రా పార్టీలు నగరానికి వలస బాధితుల్లాగ తరలి వస్తున్నాయి హైదరాబాద్ కు చెందిన కొందరు ఈవెంట్ ఆర్గనైజర్లు నగరానికి ముజ్రా పార్టీలను పరిచయం చేస్తున్నారు. ధనిక యువతీ, యువకులే టార్గెట్ గా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా నగరంలోని అనుమతులు లేని పబ్బులు, హోటల్లే క్రేంద్రంగా చేసుకొని కల్చర్ ముసుగులో గప్పు పార్టీలకు అడ్డాగా మారుస్తున్నారు.

విజయవాడ భవానీపురంలో గల ఓ హోటల్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల దగ్గర నుంచి 5 వేల నుంచి 10 వేల చొప్పున 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని వెల్లడించారు. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

విచ్చల విడిగా డ్రగ్స్.. సాయంత్రం అయితే చాలు పార్టీల పేరుతో జల్సాల జోరు మాదక ద్రవ్యాల మత్తులో యువత నిన్నటి దాక రేవ్ పార్టీలు తాజాగా ముజ్రా పార్టీలు పేరు మాత్రమే మారింది చేసే పని మారలేదు. విజయవాడలో విష సంస్కృతి ...ముజ్రా పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న పర్మిషన్ లేని పబ్బులు...పోలీసుల దాడిలో వెలుగు చూసిన భయంకరమైన వాస్తవాలు.. పేకాటలు, క్లబ్బులు, రికార్డింగ్ డాన్సులు, రేవ్ పార్టీలకే పరిమితమైన నేరాలు ఇప్పుడు ముజ్రా డాన్సుల పార్టీలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్తున్నాయి. ఇవన్నీ బాగా డబ్బు ఉన్న వారిని చేసిన వారిని టార్గెట్ చేసుకుని నడుస్తున్నాయి. ముజ్రా కూడా దాదాపు రేవ్ పార్టీ లాంటిదే అయితే రేవ్ పార్టీ ఓ గార్డెన్ లోనో ఆరుబైటనో నిర్వహిస్తారు ముజ్రా మాత్రం ఒక రూంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించొచ్చు ఏమాత్రం అనుమానం రాకుండా స్మూత్ గా జరిగిపోతుంది. ముజ్రా పార్టీ కోసం ఒక్కొక్కరి దగ్గర నుంచి భారీగానే డబ్బు వసూలు చేస్తారు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఐదు నుంచి పదివేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అన్ లిమిటెడ్ లిక్కర్ డ్రగ్స్ కూడా ఈ పార్టీలో పార్ట్ అయిపోతాయి. మొత్తానికి బెజవాడ అభివృద్ధికే కాదు నేరాలకు కూడా అడ్డాగా మారిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories