logo
జాతీయం

కరుణానిధి వేషంలో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ శివప్రసాద్‌

కరుణానిధి వేషంలో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ శివప్రసాద్‌
X
Highlights

ప్రదాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. రోజుకో వేషంతో కేంద్రానికి నిరసనలు...

ప్రదాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. రోజుకో వేషంతో కేంద్రానికి నిరసనలు తెలుపుతున్న శివప్రసాద్ ఇవాళ కరుణానిధి వేషంలో పార్లమెంటుకు వెళ్లారు. మోడీ ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ కరుణానిధి మాదిరిగా డైలాగ్‌లు విసిరారు. స్నేహంలో కర్ణుడిలా, సత్యవాక్కు పాలనలో హరిశ్చంద్రుడిలా మెలగాలంటూ నరేంద్రమోడీకి సూచించారు. మాటలు చెప్పి చంద్రబాబుని మోసగించారని, ఏపీ ప్రజలు అందుకు తగిన శాస్తి చేస్తారని మోడీపై మండిపడ్డారు ఎంపీ శివప్రసాద్. ప్రధాని మోడీ టైటానిక్‌ షిప్‌లాంటి వారని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముంచేశారని ఎంపీ శివప్రసాద్‌ ఆరోపించారు.

Next Story