టీడీపీకి షాక్ ఇచ్చిన గీత..!

Highlights

వైసీపీలో మహిళలకు గౌరవం లేదని ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడినట్లు తెలిపారు....

వైసీపీలో మహిళలకు గౌరవం లేదని ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడినట్లు తెలిపారు. తనకు నియోజకవర్గం... ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకోలేదన్న ఎంపీ గీత ఎన్నికల్లో పోటీకి ముందే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.

ఇదిలావుంటే కొత్త‌ప‌ల్లి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు . కొంత కాలంగా అధికార పార్టీ నేత‌ల‌కు, ఫిరాయింపు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌కు మ‌ధ్య నెల‌కొన్న వివాదాలు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ క్ర‌మంలో త‌న‌కు తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటూ గీత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. అంతేకాదు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గిరిజ‌న ప్రజా ప్ర‌తినిధుల‌కు అన్యాయం చేస్తోంద‌ని కూడా గీత ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories