కేసీఆర్‌ వ్యాఖ్యల్లో పొరపాటు దొర్లింది: కవిత

కేసీఆర్‌ వ్యాఖ్యల్లో పొరపాటు దొర్లింది: కవిత
x
Highlights

ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ఎంపీ కవిత. కేవలం మాట దొర్లడం వల్ల జరిగిన తప్పిదం మాత్రమేనని...

ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ఎంపీ కవిత. కేవలం మాట దొర్లడం వల్ల జరిగిన తప్పిదం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అంతేగానీ ప్రధానిని అవమానపర్చాలన్న ఉద్దేశం తమకు లేదని ఆమె చెప్పారు. చిన్న పొరపాటు దొర్లినందుకు బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కవిత విమర్శించారు. రైతుల కష్టాల పట్ల ఆవేదనతోనే కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు. ఐనా రైతు బడ్జెట్ అని చెప్పి కేంద్రం రైతులకు కేటాయించిందేమీ లేదని కవిత అన్నారు.

ప్రత్యేక హోదాకు 2014 నుంచి మద్దతు ఇస్తున్నామన్న కవిత విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీ కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమనేది నిరంతర ప్రక్రియ అని హామీలు ఎవరిచ్చినా ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. వ్యాపారానికి సంబంధించి 30 బిల్లులు ఇప్పటివరకు పెట్టారు కానీ వ్యవసాయానికి సంబంధించిన ఒక్క బిల్లు కూడా పెట్టలేదన్నారు కవిత. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీస్తామని ఆమె చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories