logo
సినిమా

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు
X
Highlights

గుంటూరు ఎంపీ, సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. అతను...

గుంటూరు ఎంపీ, సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. అతను హీరోగా, కన్నడ నటి నభా నటేష్ హీరోహీరోయిన్ గా 'అదే నువ్వు అదే నేను' అనే చిత్రం ప్రారంభమైంది. ఈ మూవీకి శశి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ ఉన్న నిర్మాత దిల్‌ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రొమాంటిక్ ఎంటైర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దసరా సందర్బంగా గురువారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సూపర్‌స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మంజుల, నిర్మాత దిల్‌రాజు, ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Next Story