మనోవేదనతో తల్లీ కూతుళ్లు ఆత్మహత్య

మనోవేదనతో తల్లీ కూతుళ్లు ఆత్మహత్య
x
Highlights

అనారోగ్యంతో భర్త చనిపోయాడు. అయినా కుమారుడు, కుమార్తె జీవితంగా బ్రతకాలనుకుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కుమారుడు కూడా చనిపోయాడు. దాంతో భర్త కుమారుడు...

అనారోగ్యంతో భర్త చనిపోయాడు. అయినా కుమారుడు, కుమార్తె జీవితంగా బ్రతకాలనుకుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కుమారుడు కూడా చనిపోయాడు. దాంతో భర్త కుమారుడు లేని తనకొద్దంటూ కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హన్మకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొత్తురు–బొక్కలగడ్డలో గురువారం జరిగింది. సరిత(38) మనుగొండ బాబు, భార్య భర్తలు. వీరికి కుమారుడు రోహిత్‌(21) కూతురు మధుమిత (17) ఉన్నారు. బాబు 1992 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌.. అయితే అనారోగ్యం కారణంగా 2007 బాబు మృతిచెందాడు. దాంతో సరితకు హన్మకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ విధిరాతను ఎవరూ మార్చలేరన్నట్టు నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు హన్మకొండలోని సర్క్యూట్‌ గెస్ట్‌ హౌస్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త అనారోగ్యంతో మృతి చెందగా.. కుమారుడు కూడా ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆమె ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలో ఎవరితోనూ మాట్లాడకుండా జీవితం మీద ఆశలు కోల్పోయినట్టు అనుకుంది. ఇటీవల తన కూతురితో సహా పుట్టింటికి వచ్చింది సరిత. గురువారం దేశాయిపేటలో బంధువుల పెళ్లి ఉండడంతో సరిత తల్లిదండ్రులు వెళ్లారు. సరితను పెళ్లికి రమ్మని తల్లిదండ్రులు బ్రతిమిలాడినా వెళ్లలేదు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు బయటి నుంచి సరితను పిలిచారు. లోపల గడియ పెట్టి ఉండి.. ఎంత పిలిచినా సరిత, మధుమిత పలుకలేదు. దీంతో బలవంతంగా తలుపులను తెరిచి చూడగా సరిత, మధుమిత ఇంటి దూలానికి వేలాడుతూ కనిపించరు. దూలానికి వేలాడుతున్న వారిని చూసి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధించారు. 11 సంవత్సరాలలో కుటుంబసభ్యుల్ని అందరిని పోగొట్టుకున్న ఆ కుటుంబాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories