logo
జాతీయం

మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ మూజీబ్ అరెస్టు

మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ మూజీబ్ అరెస్టు
X
Highlights

అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ముజీబ్ ఎట్టకేలకు ...

అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ముజీబ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కర్నాటక రాష్ట్రం సంపెగహళ్లిలోని ఎర్రచందనం నిల్వల గోడౌన్లపై కడప పోలీసులు మెరుపు దాడులు చేశారు.దీంతో స్మగర్లు పోలీసులపై రాళ్ల దాడికి దిగి పోలీసు వాహనాల్ని ధ్వంసం చేసి భయబ్రాంతులకు గురిచేశారు.అయినా ఎదరు నిలిచి పోరాడిన పోలీసులు చివరికి స్మగ్లర్ మూజీబ్ తో పాటు గయాజ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.ఐదు కోట్లు విలువ చేసే మూడు టన్నుల ఎర్రచందనం దుంగల్ని మూడు కార్లని స్వాధీనం చేసుకున్నారు. కాగా గత కొద్ది రోజులుగా ముజీబ్ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరకు అతడు వారి చేతికి చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Next Story