విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి ...టీడీపీ, బీజేపీ నేతలకు హెచ్చరికలు...

విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి ...టీడీపీ, బీజేపీ నేతలకు హెచ్చరికలు...
x
Highlights

విశాఖ మన్యంలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. నిత్యం ఏదో ఒక మూల తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జీకే వీధి మండలం...

విశాఖ మన్యంలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. నిత్యం ఏదో ఒక మూల తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జీకే వీధి మండలం ఆర్‌వి నగర్‌లో టీడీపీ, బీజేపీ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టుల కరపత్రాలు విడుదల చేశారు. ఏపీఎఫ్‌డీసీ కార్యాలయం దగ్గర గాలికొండ ఏరియా కమిటీ పేరుతో .. కరపత్రాలను అతికించిన మావోయిస్టులు బాక్సైట్ తవ్వకాలకు మద్దతిస్తే తరిమికొడతామంటూ హెచ్చరించారు. కాఫీ తోటల యాజమాన్య హక్కులను ఆదివాసీలకే ఇవ్వాలంటూ తమ లేఖలో డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories