మోడీ హవా కొనసాగినా..తగ్గిన సీట్లు

మోడీ హవా కొనసాగినా..తగ్గిన సీట్లు
x
Highlights

ఇప్పుడు అందరిలోనూ గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తే నెలకొంది. 2007లో ఆ రెండు పార్టీల పర్ఫామెన్స్ ఎలా ఉంది? ఆ తరువాత 2012లో పర్ఫామెన్స్ ఎలా...

ఇప్పుడు అందరిలోనూ గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తే నెలకొంది. 2007లో ఆ రెండు పార్టీల పర్ఫామెన్స్ ఎలా ఉంది? ఆ తరువాత 2012లో పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలుసుకుంటే.. తాజా పరిస్థితి ఎలా ఉంటుందో అంచనాకు రావచ్చు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

గత 22 ఏళ్లుగా గుజరాత్ లో పవర్ కోసం పాకులాడుతున్న కాంగ్రెస్.. ఈసారి కొంచెం కొత్తగానే ఆలోచించింది. ఆ కొత్తదనం అనేది రాహుల్ ప్రచారంలో కళ్లకు కట్టింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో 2007 ఎన్నికల్లో బీజేపీ 117 సీట్లు గెల్చుకొని తిరుగులేని శక్తిగా ఎదిగింది. గోద్రా ఘటన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో మోడీ గుజరాతీలను బాగా ఆకర్షించారు. అప్పుడు కాంగ్రెస్ 59 సీట్లకే పరిమితమైంది. కమలదళానికి 49.12 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ 38 శాతం ఓట్లతో దాదాపు 11 శాతం వెనుకబడిపోయింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు దాదాపు మిగిలిన 13 శాతం ఓట్లు రాబట్టి 6 సీట్లు గెల్చుకున్నారు.
ఇక 2012 ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగించడం విశేషం. అయితే మోడీ హవా ఈసారి కూడా కొనసాగినా ఓ రెండు సీట్లు మాత్రం గతంలో కన్నా తగ్గిపోయాయి. 47.85 శాతం ఓట్లు పొందిన కమలనాథులు 115 సీట్లు గెల్చుకోగలిగారు. ఇక కాంగ్రెస్ 38.93 శాతం ఓట్లు రాబట్టి 61 సీట్లను పొందగలిగింది. బీజేపీ కోల్పోయిన రెండు సీట్లు ఈసారి కాంగ్రెస్ ఖాతాలో జమ కావడం విశేషం. ఎప్పటిలాగే ఇతరులు, ఇండిపెండెంట్లు 13.22 శాతం ఓట్లతో 6 సీట్లలో జయకేతనం ఎగరేశారు.
మూడు కోట్లా 80 లక్షలకు పైగా ఓటర్లున్న గుజరాత్ లో మహిళా ఓటర్లు కోటీ 81 లక్షలకు పైబడి ఉండగా.. పురుష ఓటర్లు దాదాపు 2 కోట్ల దాకా ఉన్నారు. గత రెండు వరుస అసెంబ్లీ పోల్స్ ను చూసినట్టయితే.. ఈ పదేళ్లలో బీజేపీ దాదాపు 2 శాతం ఓట్లను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఈ పదేళ్లలో దాదాపు 1 శాతం ఓట్లను అదనంగా పొందినట్లు అర్థమవుతోంది. ఇక తాజా ఎలక్షన్స్ కి ముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లోనూ కాంగ్రెస్ కాస్త పుంజుకున్నట్టు కనిపించడం గమనించాల్సిన అంశం. ఈ అంశాలను ఓసారి పరిగణనలోకి తీసుకున్నట్టయితే.. ఈసారి బీజేపీ మరికాస్త నష్టపోతుందన్న ప్రాథమిక అంచనా సామాన్య జనంలో ఏర్పడుతోంది.

గుజరాత్ - 2007
బీజేపీ 117 49.12శాతం ఓట్లు
కాంగ్రెస్ 59 38 శాతం ఓట్లు

ఇతరులు 6 12.88 శాతం ఓట్లు

నోట్ - సీపీఐ, 2 సీట్లకు పోటీ చేస్తే 0, సీపీఎం 1 సీటుకు పోటీ చేస్తే 0, బీఎస్పీ 166 సీట్లకు పోటీ చేస్తే 0, ఎన్సీపీ 10 సీట్లకు పోటీ చేస్తే 3
-----------------------------

గుజరాత్ - 2012
బీజేపీ 115 47.85శాతం
కాంగ్రెస్ 61 38.93 శాతం
ఇతరులు 6 13.22 శాతం
-----------------------------

మొత్తం ఓటర్లు 3,80,99,110
మహిళలు 1,81,48,715
పురుషులు 1,99,50,206


Show Full Article
Print Article
Next Story
More Stories