రోజా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెబుతా : బండ్ల గణేష్

రోజా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెబుతా : బండ్ల గణేష్
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు క్షమాపణలు చెబితే తాను రోజా కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత బండ్లగణేష్ తెలిపారు. ఓ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు క్షమాపణలు చెబితే తాను రోజా కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత బండ్లగణేష్ తెలిపారు.

ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రోజా, బండ్లగణేష్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పై రోజా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ బండ్లగణేష్ - రోజాల మధ్య మాటల యుద్ధం శృతిమించింది. దీనిపై సదరు యాంకర్ ఒక ప్రజా నాయకురాలిని అలా అనడంపై మీరు రోజాగారికి క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది. తాను అన్నమాటల్లో తప్పులేదు కాబట్టి ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరంలేదని బండ్లగణేష్ అన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ గురించి అసభ్యంగా మాట్లాడిన రోజా ఆయన క్షమాపణ చెప్పమనండి. అప్పుడు నేను ఆవిడ కాళ్లు పట్టుకుని మరీ క్షమాపణ చెబుతా. లేదంటే నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు ఏం చేయలేదని సూచించారు. అయితే ఆ వివాదంపై బండ్లగణేష్ క్లారిటీ ఇచ్చారు. ఆవిడ ఆవేశంతో మాట జారారు. ఆ తర్వాతే నేను కూడా ఆవేశంతో మాట జారాల్సి వచ్చింది. అంతే..’’ అంటూ బండ్ల గణేష్ మరోసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories