Top
logo

మరో కాంగ్రెస్ కీలకనేత టీఆర్ఎస్ లో చేరే అవకాశం?.. డీకే అరుణ బుజ్జగింపు!

మరో కాంగ్రెస్ కీలకనేత టీఆర్ఎస్ లో చేరే అవకాశం?.. డీకే అరుణ బుజ్జగింపు!
X
Highlights

గతకొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో...

గతకొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీనేత ఎమ్మెల్సీ దామోదర రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాగం కాంగ్రెస్ లో చేరితే తాను పార్టీకి గుడ్ బై చెబుతానని ముందే హెచ్చరించారు. కానీ నాగం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ పరిణామక్రమం దామోదర రెడ్డికి రుచించలేదు. వెంటనే కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దామోదర రెడ్డి పార్టీ మారతారని ఊహాగానాల నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్యే డీకే అరుణ దామోదర రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడారు.. దామోదర రెడ్డిని పార్టీ మారవద్దని కోరానని. తనకు చెప్పకుండానే ‘నాగం’ ను పార్టీలో చేర్చుకున్నారని దామోదర్ రెడ్డి బాధ పడుతున్నారని ఆమె చెప్పారు. సమస్యపరిష్కారం కోసం మరో సారి రాహుల్ గాంధీని కలుద్దామని ఎమ్మెల్సీకి చెప్పానని ఆమె అన్నారు.

Next Story