పవన్ పై అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..!

Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. సినీనటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. సినీనటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు.. అయన యాత్ర కేవలం వైసీపీని విమర్శించడానికే తప్ప ప్రజలకోసం పని చేద్దామనే తాపత్రయం లేకపోవడం శోచనీయమన్నారు.. తాను పవన్ కు అభిమానినే అన్న అనిల్ పవన్ చేస్తున్న కుళ్ళు రాజకీయాలు నచ్చకే మనసు చంపుకుని పవన్ కళ్యాణ్ ను అభిమానించడం మానేస్తున్నఅంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ప్రతిసారి ఏదో ఒక యాత్ర పేరుతో టీడీపీకి అనుకూలంగా మాటాడుతున్నారు.. ఇంతోటిదానికి యాత్ర ఎందుకు..? ప్రెస్ మీట్ పెట్టి రోజు జగన్ ను తిట్టొచ్చు కదా, అని ఎద్దేవా చేసారు..

ఇదిలావుంటే కులాలపై పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా అనిల్ ఖండించారు.. ఆయనకు ఉన్నంత కులపిచ్చి ఈ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబునాయుడుకి కూడా లేదని ఇది జగమెరిగిన సత్యమని అన్నారు.. పదే పదే తమ అధినేతను వారసత్వంగా సీఎం అనుకోవాలనుకోవడం తప్పని అంటున్నారు.. ఇదే కరెక్ట్ అయితే మీ అన్నయ్య వారసత్వాన్ని ఎందుకు పుణికిపుచుకుని మీరు హీరో అయ్యారో సమాధానం చెప్పండని పవన్ ని ప్రశ్నించారు.. తమ కాగా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే వాళ్ళను తాను అభిమానించడం మానేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంస్యమయింది...

Show Full Article
Print Article
Next Story
More Stories