గల్లంతయ్యాయి సరే... గల్లంతు కాని ఓట్లైనా గట్టెక్కిస్తాయా?

గల్లంతయ్యాయి సరే... గల్లంతు కాని ఓట్లైనా గట్టెక్కిస్తాయా?
x
Highlights

రాష్ట్రంలో ముందస్తూ ఎన్నిలకు వేడి రాజుకుంటన్నావేళ 30 లక్షల ఓట్లు గల్లంతు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. అనేక సాంకేతిక కారణాల వల్ల ఓట్ల తొలగింపు...

రాష్ట్రంలో ముందస్తూ ఎన్నిలకు వేడి రాజుకుంటన్నావేళ 30 లక్షల ఓట్లు గల్లంతు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. అనేక సాంకేతిక కారణాల వల్ల ఓట్ల తొలగింపు జరిగిందని ఈసీ అంటుంటే కావాలనే ఓట్ల తొలగింపు చేశారని రాజకీయపార్టీలు అంటున్నాయి.80 లక్షల వరకు ఓట్ల తొలగింపు జరిగిందని తక్షణం ఓట్ల జాబితా సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూన్నారు.

తెలంగాణ శాస‌న‌స‌భకి ఎన్నిక‌ల ప్రక్రియ మొద‌లైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిషన్ అందుక‌నుగుణంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు ఉన్న ప‌రిస్థితులపై ఈసి ర‌జ‌త్ కుమార్ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి నివేదిక కూడా అందించారు. కేంద్ర ఎన్నికల బృందం కూడా ఎన్నికల సన్నద్దతపై అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి, రిపోర్ట్ ఇస్తోంది. అయితే, 2014లో ఉన్న ఓట్ల సంఖ్య కంటే ప్రస్తుతం ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసిన ఓటర్ల జాబితాలో గణనీయంగా ఓట్లు త‌గ్గడం, వివాదంగా మారుతోంది. 20 ల‌క్షల వ‌ర‌కు తగ్గాయ‌ని ఈసీ చెబుతుంటే...80 ల‌క్షలపైనే ఓట్లు గల్లంతయ్యాయని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. గ‌త సాధారాణ ఎన్నిక‌ల్లో 2 కోట్ల 81 ల‌క్షలు ఉంటే, తాజ‌ాగా ఆ సంఖ్య 2 కోట్ల 61 ల‌క్షల‌కు ప‌డిపోయింది.

ఓట్లు త‌గ్గడానికి ఈసి చెబుతున్న కారణాలు..ప్రధానంగా 2014లో ఉమ్మడి రాష్ట్రం ప్రాతిపదిక‌గా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌తో పాటు..ఇత‌ర రాష్ట్రాలవారు సైతం త‌మ స్వంత ప్రాంతాల‌కు త‌ర‌లిపోతున్నారు. ఇలా అధికారికంగా ఏపీకి వెళ్ళిన వారి కుటుంబాలు ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 60వేలకి పైగా కుటుంబాలు ఉన్నట్లు చెబుతున్నారు. మ‌రోవైపు ఓటుకు ఆధార్‌ని అనుసంధానం చేయ‌డంతో డూప్లికేష‌న్ బాగా త‌గ్గిపోయింద‌ని అంటున్నారు. మూడ‌వ‌ది, కిరాయిదారులు ఇళ్ళను త‌రుచూ మారుస్తుండ‌డం. ఇక హైదరాబాద్ కేంద్రంగా, చదువుకునే ఇంజ‌నీరింగ్, మెడిసిన్‌తో పాటు ఉన్నత చ‌దువులు చ‌దివే విద్యార్ధులు, అప్పుడు త‌మ అవ‌స‌రాల కోసం స్ధానికంగా ఉంటున్న అడ్రస్‌ల‌తో ఓటు గుర్తింపు కార్డు పొందారు. చ‌దువు పూర్తైన త‌ర్వాత స్వంత గ్రామాల‌కు వెళ్ళడం వంటి అంశాల‌తో చాలా ఓట్లు త‌గ్గిపోయాయ‌ని అధికారులు చెబుతున్నారు. కానీ ఓట్ల గల్లంతు వెనక ఉన్న మతలబేంటో విచారణ చేయాలని విపక్ష పార్టీల నేతలు, కేంద్ర ఎన్నికల బృందంతో జరిగినే సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఓట్లు తగ్గడానికి కారణాలేంటో, ఆధారాల‌తో స‌హా అధికారులకు స‌మ‌ర్పించామన్నారు. ఒక్క హైదరాబాద్‌లో మొత్తం 41.32లక్షల ఓటర్లు ఉంటే, అందులో 6.66 లక్షల మంది పేర్లు తొలగించార‌ని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో 18శాతం బోగస్‌ ఓట్లను జాబితా నుంచి తొలగించారని చెబుతున్నారు.

అయితే ఓట్లు త‌గ్గడంపై ఈసి చెబుతున్న మాటలు శాస్త్రీయంగా లేవ‌ని...కేవ‌లం కక్ష్య పూరితంగానే, ఓట్లు తొలంగించార‌ని అంటున్నారు పార్టీల నేత‌లు. దీనికి గ‌త గ్రేట‌ర్ హైదరాబాద్ ఎన్నిక‌లే ఉదాహ‌రాణ అంటున్నారు..ప్రతిప‌క్షాలు బ‌లంగా ఉన్న డివిజ‌న్లను సెల‌క్ట్ చేసి మ‌రీ ఓట్లు తొల‌గించార‌ని, ఆఫీసర్లందరూ, అధికార పార్టీ చెప్పుచేతల్లో ఉన్నార‌ని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ, ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ఇప్పటికైనా తప్పులు సవరించి, తొలగించిన ఓట్లను పునరుద్దరించాలని, సమగ్ర విచారణ జరిపించాలని విపక్షాలు డిమండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories