ఇంటి అద్దె కట్టలేదని.. బాలికను పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంతలో!
ఇంటి అద్దె కట్టలేదని ఓ మైనర్ బాలిక జీవితానికి ఎసరు తెచ్చాడో వ్యక్తి. తనని పెళ్ళిచేసుకుంటే ఇంటి అద్దె కట్టే...
ఇంటి అద్దె కట్టలేదని ఓ మైనర్ బాలిక జీవితానికి ఎసరు తెచ్చాడో వ్యక్తి. తనని పెళ్ళిచేసుకుంటే ఇంటి అద్దె కట్టే బాధ తప్పుతుంది..పైగా ఆర్ధిక సహాయం చేస్తానని బాలిక తల్లిని నమ్మించి పెళ్ళికి విఫలయత్నం చేశాడు రమేష్ అనే వ్యక్తి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుళ్లపల్లి మండలం కాటేదాన్ గ్రామంలో జరిగింది. గత కొద్ది రోజులుగా రమేష్(40) అనే వికలాంగుడి ఇంట్లో అద్దెకు ఉంటోంది ఓ కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలున్న ఆ కుటుంబం పేదరికంతో మగ్గిపోతుంది. పైగా కొన్ని నెలల నుంచి ఇంటి అద్దె కట్టే స్థోమత కూడా లేదు.. దీంతో వారి పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న ఇంటి ఓనర్ రమేష్ 16 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకుంటాను జీవితాంతం ఇంటి అద్దె కట్టే బాధ తప్పుతుంది దాంతో పాటు కొంత ఆర్ధిక సహాయం చేస్తానని బాలిక తల్లిని ఒప్పించాడు. ఆమెకూడా తమ కష్టాలు తీరతాయని బలవంతంగా పెళ్ళికి ఒప్పించింది. ఈ పెళ్లి ఇష్టం లేని బాలిక తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో వ్యవహారం కాస్త చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులకు తెలిసింది.. వెంటనే వారు పోలీసులతో రమేష్ ఇంటికి చేసురుకుని అతన్ని ఆరెస్ట్ చేయించారు. అనంతరం బాలికను స్టేట్ హోమ్ కు తరలించారు.
లైవ్ టీవి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
5 Dec 2019 5:10 PM GMTIndia vs West Indies : కొత్త రూల్ ఇదే
5 Dec 2019 4:23 PM GMTఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది
5 Dec 2019 4:15 PM GMTక్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ
5 Dec 2019 3:22 PM GMTముగిసిన కర్ణాటక ఉపఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని ఆ...
5 Dec 2019 2:48 PM GMT