చిత్తూరులో భూకంపం..

చిత్తూరులో భూకంపం..
x
Highlights

చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. ఐరాల మండలం ఐకె రెడ్డిపల్లిలో అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు...

చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. ఐరాల మండలం ఐకె రెడ్డిపల్లిలో అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే భారీ శబ్దాలు రావడంతో గ్రామస్థులు భయాందోళనతో ఎక్కడెక్కడికో పరుగులు తీశారు. అర్ధ రాత్రి వేళ ఓ పక్క వర్షం,మరో పక్క భూకంపం భయంతో గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. మరలా మరోసారి భూకంపం వస్తుందేమోనని గ్రామస్థులు హడలిపోతున్నారు. కాగా ఈ ఘటనపై అధికారులు స్పందించినట్టు తెలుస్తోంది. ఇది సాధారణమైనదేనని పెద్దగా భయాందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories