జగన్‌, పవన్‌కు వ్యవసాయమంటే తెలుసా?

జగన్‌, పవన్‌కు వ్యవసాయమంటే తెలుసా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి దేశం మొత్తం వ్యవసాయం నేరుచ్చుకుంటుంటే పక్క రాష్ట్రం తెలంగాణను చూసి నేర్చేకోవాలని ఏపీ విపక్ష నేతలు అనడంపై మంత్రి...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి దేశం మొత్తం వ్యవసాయం నేరుచ్చుకుంటుంటే పక్క రాష్ట్రం తెలంగాణను చూసి నేర్చేకోవాలని ఏపీ విపక్ష నేతలు అనడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి త్రీవస్థాయిలో మండిపడ్డారు. అసలు వైసీపీ అధినేత జగన్, పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే ఎంటో తెలుసా? అని సోమిరెడ్డి నిలదీశారు. గడిచిన ఐదేండ్లలో వ్యవసాయ రంగంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.17,361.21 కోట్లు అధికంగా ఖర్చు చేశామని సోమిరెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. వ్యవసాయ సేద్యం అంటే అర్థం తెలియని వారు వ్యవసాయానికి స్పెల్లింగ్ తెలియని వాళ్లు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ లెక్కప్రకారం చూసిన ఏ విధంగా చూసినా రైతులకు ఎక్కువ మేలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories