Top
logo

గుజరాత్ నంబర్స్ పై మంత్రి కేటీఆర్ అసహనం..!

గుజరాత్ నంబర్స్ పై మంత్రి కేటీఆర్ అసహనం..!
X
Highlights

గుజరాత్ , హిమాచల్ ఎన్నికల ఫలితాలు నిమిషానికొక రీతిలో మారుతుండటంతో పలు ఛానళ్ళు ఫలితాలను సరిగా...

గుజరాత్ , హిమాచల్ ఎన్నికల ఫలితాలు నిమిషానికొక రీతిలో మారుతుండటంతో పలు ఛానళ్ళు ఫలితాలను సరిగా చూపించలేకపోతున్నాయి.. దీంతో ఏ ఛానల్ కరెక్ట్ గా చెబుతుందో అర్ధంకాకా సాక్షాత్తు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసహనం వ్యక్తం చేసారు.. గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం అయన కూడా టీవీ ముందు కూర్చుని పలు చానెళ్లను వీక్షిస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఆధిక్యంపై ఒక్కో చానెల్ ఒక్కో నంబర్‌ను ఇస్తోందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో సందిగ్ధం వ్యక్తం చేశారు. ఎవరు, ఎక్కడ ఆధిక్యంలో ఉన్నారనే దానిపై ఛానెళ్ల సంఖ్యలు గందరగోళంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story