మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్

మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్
x
Highlights

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసిరారు.అందులో ప్రముఖ లెజెండరీ...

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసిరారు.అందులో ప్రముఖ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు కూడా ఉన్నారు.. అయితే మంత్రి విసిరినా ఛాలెంజ్ ను స్వీకరించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ మేరకు తన నివాసంలో మొక్కలు నాటుతూ.. మంత్రి కేటీఆర్ కు రీట్వీట్ చేశారు.. ‘గ్రీన్ ఛాలెంజ్ కోసం నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సవాలు నేను స్వీకరిస్తున్నాను.. గ్రీనర్ ప్లానెట్ మన చేతుల్లో ఉంది’ అంటూ మాస్టర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఐదుగురికి నామినేట్ చేయాలంటూ సచిన్ కు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories