నా ఇష్టాలు ఇవే : మంత్రి కేటీఆర్

నా ఇష్టాలు ఇవే : మంత్రి కేటీఆర్
x
Highlights

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో నెటిజన్లతో సరదాగా గడిపారు. ఆస్క్ కేటీఆర్ యాష్‌ ట్యాగ్‌తో ఆయనకు ట్యాగ్ చేస్తూ.. నెటిజన్లతో ముచ్చటించారు....

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో నెటిజన్లతో సరదాగా గడిపారు. ఆస్క్ కేటీఆర్ యాష్‌ ట్యాగ్‌తో ఆయనకు ట్యాగ్ చేస్తూ.. నెటిజన్లతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అని చెప్పారు. ఇక ముఖ్యమంత్రులుగా వైయస్ఆర్, కేసీఆర్ లలో ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు సమాధానం మీకే తెలుసంటూ షాకింగ్ సమాధానం చెప్పాడు. ఇష్టమైన క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అమ్మాయిలకు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకన్న ప్రశ్నకు తనకు అంత ధైర్యం లేదని చమత్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories