మంత్రి హరీష్‌రావు సెల్‌ఫోన్‌ మాయం

Highlights

ఒకరోజు అన్నం తినకుండా అయినా ఉంటాం కానీ... ఒక్క గంట సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేమ్‌. మన జీవితంలో అంతగా పెనవేసుకుపోయిందది. అలాంటిది ఉన్నపళంగా సెల్‌ఫోన్‌...

ఒకరోజు అన్నం తినకుండా అయినా ఉంటాం కానీ... ఒక్క గంట సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేమ్‌. మన జీవితంలో అంతగా పెనవేసుకుపోయిందది. అలాంటిది ఉన్నపళంగా సెల్‌ఫోన్‌ పోతే! పోగొట్టుకున్న వాళ్లకే తెలుస్తుంది ఆ బాధేంటో. ఆ జాబితాలో ఇప్పుడు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా చేరారు.
అవును. తెలంగాణ మంత్రి హరీష్‌రావు సెల్‌ఫోన్‌ పోయింది. ఆచార్య జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం పనుల పరిశీలనకని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి వెళ్లిన హరీష్‌రావు యాపిల్‌ ఫోన్‌ అక్కడే మాయమైపోయింది.
కన్నెపల్లిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌‌ను, లిఫ్ట్‌ సిస్టమ్‌ను పరిశీలించడానికి సీఎం కలసి వెళ్లారు హరీష్‌రావు. తిరిగి వస్తుండగానే సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నారు. అక్కడి నుంచి కాస్త దూరం వచ్చే వరకు కూడా హరీష్‌ ఫోన్‌ పోయిన విషయాన్ని గ్రహించలేకపోయారు.
కారులో జేబు తడుముకోగా... ఫోన్‌ కనిపించలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి విషయం చెప్పారు. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు తిరిగి కన్నెపల్లికి వచ్చారు. మంత్రి ఎక్కడెక్కడ తిరిగారో అక్కడంతా గాలించారు. అయినా లాభం లేదు. పోయిన ఫోన్‌ దొరకలేదు. ఫోన్‌ పోతే కామన్‌ మ్యానే కంగారెత్తిపోతే... మంత్రిలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి ఇంకెలా ఫీలవ్వాలి. అందుకే మంత్రి హరీష్‌రావు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే తన పాత నెంబర్‌తో కొత్త సిమ్‌ తెప్పించుకొని కంటిన్యూ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories