Top
logo

ముందస్తు ఎన్నికలు....ప్రకటించిన మంత్రి హరీష్‌రావు

X
Highlights

అసెంబ్లీ రద్దు ముహూర్తం ఖాయమంటూ ఊహగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ మంత్రి హరీష్‌...

అసెంబ్లీ రద్దు ముహూర్తం ఖాయమంటూ ఊహగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ మంత్రి హరీష్‌ రావు పరోక్షంగా ప్రకటించారు. ఎల్లుండి హుస్నాబాద్ నిర్వహిస్తున్న బహిరంగ సభను సీఎం కేసీఆర్ సెంటి మెంట్‌తోనే చేపట్టారన్నారు. గతంలో కూడా ఇక్కడి నుంచే ప్రచారం చేపట్టి విజయం సాధించామన్న ఆయన ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో తామే విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు నూటికి నూరు శాతం టీఆర్ఎస్‌ ఆశీర్వదిస్తారని ఆ‍యన అన్నారు. హుస్నాబాద్‌లో బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Next Story