టీఆర్ఎస్‌లో కలకలం..మంత్రి కుమారుడి తిట్ల పురాణం..ఎంపీపై బూతులు

టీఆర్ఎస్‌లో కలకలం..మంత్రి కుమారుడి తిట్ల పురాణం..ఎంపీపై బూతులు
x
Highlights

తెలంగాణ మంత్రి చందూలాల్ కుమారుడు, ములుగు పీఏసీఎస్ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ బూతుపురాణం ఆడియో క్లిప్పింగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ...

తెలంగాణ మంత్రి చందూలాల్ కుమారుడు, ములుగు పీఏసీఎస్ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ బూతుపురాణం ఆడియో క్లిప్పింగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ కార్యకర్తతో జరిగిన వాగ్వాదంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌పై ప్రహ్లాద్ నోరు పారేసుకున్నారు.

సొంత పార్టీ ఎంపీపైనే ప్రహ్లాద్‌ బూతుపురాణం కలకలం రేపుతోంది. జయశంకర్‌ జిల్లా ములుగు మండలం జంగాలపల్లికిచెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కె.రవిదాసు మంత్రి కుమారుడు ప్రహ్లాద్‌కు ఫోన్‌ చేశారు. తనకు పదవి రాలేదని ప్రస్తావించారు. మొన్నమొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని కొంచెం గట్టిగానే వాదించారు. ఆవేశానికి గురైన ప్రహ్లాద్‌.. ఉంటే ఉండు పోతే పో అని దురుసుగానే మాట్లాడారు. మేం ఎందుకు పోతాం సార్‌ అని కార్యకర్త నిలదీయగా, ఎంపీ పేరు చెబితే వాడు వచ్చి పీకుతాడా? ఏంటీ ఎంపీ గొప్ప? అని నోరు పారేసుకున్నారు. నువ్వు నాకు మెస్సేజ్‌ పెట్టినవు కదా? ఎంపీ నా నియోజకవర్గానికి వచ్చి పీకుతాడా అంటూ బూతు పురాణం మొదలుపెట్టారు. ‘‘డెఫినెట్‌గా నువ్వు ఎంపీ దగ్గరికి పోవాలి. వాడు నీకు ఏం పదవి ఇస్తాడో చూస్తా’’ అన్నారు. వాడి పేరు చెప్పి నన్ను భయపెట్టిస్తున్నవా? అంటూ ప్రహ్లాద్‌ భగ్గుమన్నాడు. దాదాపు 3 నిమిషాల ఆడియోలో సీతారాంనాయక్‌ పేరు వాడటం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories