చిరంజీవిని కలిసిన మంత్రి అఖిలప్రియ.. నేడో రేపో వైయస్ఆర్..

చిరంజీవిని కలిసిన మంత్రి అఖిలప్రియ.. నేడో రేపో వైయస్ఆర్..
x
Highlights

మెగాస్టార్ చిరంజీవిని ఏపీ పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లిన అఖిలప్రియ... చిరుకు తన వివాహ ఆహ్వాన...

మెగాస్టార్ చిరంజీవిని ఏపీ పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లిన అఖిలప్రియ... చిరుకు తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా తప్పకుండా పెళ్ళికి రావలసిందిగా ఆమె చిరును కోరారు. ఆమెతో పాటు ఆమె సోదరి మౌనిక, ఆమె భర్త గణేష్ రెడ్డి, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలావుంటే ఈ నెల 29న మంత్రి అఖిలప్రియ వివాహం స్నేహితుడు భార్గవ్ రామ్ తో జరగనుంది. ఆళ్లగడ్డలోని భూమా ఇంజినీరింగ్ కళాశాలలో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కూడా అఖిలప్రియ, భార్గవ్ రామ్ లు తమ వివాహానికి ఆహ్వానించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు అఖిలప్రియ ఆహ్వానం అందించారు. నేడో రేపో వైయస్ కుటుంబసభ్యులను కూడా మంత్రి కలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories