logo
సినిమా

మిలియ‌న్ క్ల‌బ్‌.. వ‌రుస‌గా నాలుగోసారి

మిలియ‌న్ క్ల‌బ్‌.. వ‌రుస‌గా నాలుగోసారి
X
Highlights

ఓవ‌ర్‌సీస్ మార్కెట్ ప‌రంగా 'మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్' అనేది తెలుగు సినిమాకి ప్ర‌త్యేకమైన విష‌యంగా...

ఓవ‌ర్‌సీస్ మార్కెట్ ప‌రంగా 'మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్' అనేది తెలుగు సినిమాకి ప్ర‌త్యేకమైన విష‌యంగా చెప్పుకోవ‌చ్చు. మ‌హేష్‌బాబు 'దూకుడు'తో మొద‌లైన ఈ ట్రెండ్‌.. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' వంటి చిన్న చిత్రాల విష‌యంలోనూ కొన‌సాగి.. తెలుగు సినిమా స్థాయి పెరిగిన‌ట్ల‌య్యింది. ఇదిలా ఉంటే.. యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ కొత్త చిత్రం 'జైల‌వ‌కుశ' కూడా తాజాగా ఈ క్ల‌బ్‌లోకి చేరింది. ఈ క్ల‌బ్‌లో చేరిన తార‌క్ ఐదో చిత్ర‌మిది. అలాగే తార‌క్ నుంచి వ‌చ్చిన వ‌రుస నాలుగు చిత్రాలు ఈ క్ల‌బ్‌లో చేర‌డం విశేషం.

'టెంప‌ర్‌', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్‌', 'జై ల‌వ‌కుశ'తో ఎన్టీఆర్ వ‌రుస‌గా నాలుగు మిలియ‌న్ క్ల‌బ్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ట్ల‌య్యింది. ఇదిలా ఉంటే, గురువారం విడుద‌లైన 'జైల‌వ‌కుశ‌' రెండు రోజుల‌కు గాను వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.60 కోట్ల గ్రాస్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన 'జైల‌వ‌కుశ‌'లో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించగా త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేసింది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Next Story