జగన్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే భేటీ..

జగన్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే భేటీ..
x
Highlights

ప్రస్తుతం వైయస్ జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో సాగుతోంది. నిన్నటితో 250 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు జగన్. ఇదిలావుంటే చోడవరం...

ప్రస్తుతం వైయస్ జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో సాగుతోంది. నిన్నటితో 250 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు జగన్. ఇదిలావుంటే చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు గురువారం అనకాపల్లి మండలం దర్జీనగర్‌ వద్ద వైఎస్‌ జగన్‌ బస చేసిన ప్రదేశంలో కలిశారు. దాదాపు ఆయనతో అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మిలట్రీనాయుడు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు జగన్. అనంతరం మిలట్రీ నాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు.కాంగ్రెస్ తరుపున, ఎన్టీఆర్ హయాంలో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్టు చెప్పారు. కాగా ఇప్పటికే తన కుమారుడు రామచంద్రనాయుడు వైయస్సార్సీపీ లో ఉన్నట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories