కాంగ్రెస్ లో విషాదం.. ఎంపీ కన్నుమూత..

కాంగ్రెస్ లో విషాదం.. ఎంపీ కన్నుమూత..
x
Highlights

కాంగ్రెస్ లో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పార్లమెంటు సభ్యుడు ఎంఐ షానవాస్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ప్రస్తుతం కేరళ ప్రదేశ్...

కాంగ్రెస్ లో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పార్లమెంటు సభ్యుడు ఎంఐ షానవాస్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ప్రస్తుతం కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఆయన ఉన్నారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం షానవాస్ చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు అంతముందే క్యాన్సర్ ఉంది. ఈ క్రమంలో కేన్సర్ కాలేయానికి వ్యాపించడంతో మార్పిడి కోసం చెన్నై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. 1983వ సంవత్సరం నుంచి కేరళ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న షానవాస్ 2009, 2014లలో కేరళనుంచి ఎంపీగా విజయం సాధించారు. షానవాస్ అంత్యక్రియలు గురువారం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జరగనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. షానవాస్ మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories