logo
జాతీయం

ఉన్నావ్‌లో కీచకపర్వం...రాహుల్ అనే కామాంధుడు అరెస్ట్

ఉన్నావ్‌లో కీచకపర్వం...రాహుల్ అనే కామాంధుడు అరెస్ట్
X
Highlights

ఉన్నావ్ లో కీచకపర్వాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు....

ఉన్నావ్ లో కీచకపర్వాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. రాహుల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఉన్నావ్ జిల్లా ఎస్పీ హరీశ్ కుమార్ తెలిపారు. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు అడవుల్లోకి లాక్కుపోయి.. అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మరొకడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. గంగాఘాట్ గ్రామానికి చెందిన బాధితురాలు తనను వదిలేయమని ప్రాధేయపడినా ఆ కిరాతకులు పట్టించుకోకుండా ఆమెను దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరిస్తూ రాక్షసుల్లా ప్రవర్తించారు. ఈ వీడియోను వైరల్ చేస్తామని ఒకడు కేకలు పెట్టాడు. చివరకు కొందరు గ్రామస్తులు పరుగెత్తుకు రావడంతో ఆ కీచకులు పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. రాహుల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. గత నెలలో ఉన్నవ్‌లోనే తొమ్మిదేళ్ళ బాలికపై పాతికేళ్ళ యువకుడు అత్యంత దారుణంగా రేప్ చేసి పారిపోయాడు. ఇదే జిల్లాలో గత ఏప్రిల్‌లో 16 ఏళ్ళ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన పెను సంచలనమైంది.

Next Story