logo
సినిమా

అభిమానులకు మెగాహీరో సాయిధరమ్ తేజ్ లేఖ..

అభిమానులకు మెగాహీరో సాయిధరమ్ తేజ్ లేఖ..
X
Highlights

మెగాఅభిమానులకు మెగాహీరో సాయిధరమ్ తేజ్ లేఖ రాశారు. తాను ప్రస్తుతం అభిమానులను నిరాశ పరుస్తున్నానని.. ఇకనుంచి ఆలా ...

మెగాఅభిమానులకు మెగాహీరో సాయిధరమ్ తేజ్ లేఖ రాశారు. తాను ప్రస్తుతం అభిమానులను నిరాశ పరుస్తున్నానని.. ఇకనుంచి ఆలా ఉండదు.. అని చెబుతూ.. పుట్టిన రోజు గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘అత్యంత ప్రియమైన మెగాఅభిమానులకు అంతులేని ప్రేమతో.. గెలిచినప్పుడు వేలకుపైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా.. మీ చేతుల చప్పట్లు చప్పుడు కూడా తగ్గకుండా జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ.. వెన్నంటి ఉన్న అభిమానులందరికి కృతజ్ఞతలు.ఈ మధ్యకాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయానన్నది వాస్తవం. దానికి గల కారణాలు విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలు తీసుకుని తప్పులను సరిదిద్దుకుంటా.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఏ అభిమానమే నన్ను మానసికంగా, దృడంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. మీకు నా నుంచి చిన్న విన్నపం. నా పుట్టిన రోజు సందర్బంగా పలుచోట్ల అభిమానులు కేక్ కట్టింగ్, బ్యానర్లు కట్టడం లాంటివి.. చేస్తున్నారని చెప్పారు. వాటికి ఖర్చు పెట్టె డబ్బుతో ఎవరైనా చిన్నారి చదువులకు ఉపయోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను. ఎల్లప్పటికీ మీ అభిమానం కోరుకునే మీ సాయిధరమ్ తేజ్’ అంటూ అభిమానులనుద్దేశించి అయన ట్వీట్ చేశారు.

Next Story