logo
సినిమా

అల్లుడికోసం వెళుతున్న మామ

అల్లుడికోసం వెళుతున్న మామ
X
Highlights

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా , అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో...

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా , అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు. ఈ చిత్రాన్ని జూన్‌ 29న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకొన్నాయి. తేజ్.. ఐ లవ్ యు చిత్ర ఆడియో ఫంక్షన్ జూన్ 9వ తేదీన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. దీంతో సాయిధరమ్ తేజ్ 'నువ్వు నా ప్రపంచం. థ్యాంక్యూ మామా' అని ఈ సందర్భంగాపేర్కొన్నారు

Next Story