ఇవాళ మావోయిస్టుల తెలంగాణ బంద్‌

ఇవాళ మావోయిస్టుల తెలంగాణ బంద్‌
x
Highlights

ఇవాళ తెలంగాణ బంద్‌‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధ్వంసానికి పాల్పడ్డారు. చర్ల మండల పరిథిలోని సత్యనారాయణపురం గ్రామం...

ఇవాళ తెలంగాణ బంద్‌‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధ్వంసానికి పాల్పడ్డారు. చర్ల మండల పరిథిలోని సత్యనారాయణపురం గ్రామం దగ్గర చర్ల - భద్రాచలం ప్రధాన రహదారిపై కల్వర్టుని అర్థరాత్రి పేల్చేశారు. పేలుడు జరిగిన ప్రాంతానికి CRPF 151వ బెటాలియన్ క్యాంప్ కేవలం కిలోమీటరున్నర దూరంలో మాత్రమే ఉంది. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూబింగ్ చేపట్టాయి. బంద్‌ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తనిఖీలు చేపట్టారు. ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ పాటించాలంటూ పలు చోట్ల మావోయిస్టులు వాల్ ఫోస్టర్లు వేశారు. ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో భద్రతాదళాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో తెలంగాణ, మహారాష్ట్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం వంతెన దగ్గర పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చెరుపల్లి - మారాయిగూడెం ప్రధాన రహదారిపై కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories