టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్..
x
Highlights

ఈ వారంలో జరగబోయే టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ భేటీని తలచుకుని గులాబీ శాసన సభ్యులు బీపీ పెంచేసుకుంటున్నారు....

ఈ వారంలో జరగబోయే టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ భేటీని తలచుకుని గులాబీ శాసన సభ్యులు బీపీ పెంచేసుకుంటున్నారు. ఇంతకీ రెండు మూడు రోజుల్లో జరిగే టీఆర్ఎస్ఎల్పీ సమావేశమంటే ఎమ్మెల్యేలకు ఎందుకు దడ పుడుతోంది. అసలు టీఆర్ఎస్ఎల్పీ భేటీ అజెండా ఏంటి..? టీఆర్ఎస్ నేతలకు చెమటలు పట్టిస్తున్న అంశమేంటి..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, పార్టీ గెలుపోటములను ప్రాభావితం చేసే అంశాలపై సీఎం కేసీఆర్ ఇటీవల సర్వే నిర్వహించారు. మొత్తం మూడు సంస్థలతో సర్వే చేయించిన గులాబీ బాస్ తనకు అందిన నివేదికలపై అథ్యయనం చేశారు. ఫాం హౌస్‌లో వారం రోజుల పాటు మకాం వేసి మరీ విశ్లేషించారు. అంతేకాదు కొంత మంది సీనియర్లతో జిల్లాల వారీగా సర్వే ఫలితాలపై చర్చలు జరిపారు. అయితే సర్వేలో కేసీఆర్ ఆశించిన ఫలితాలు రాలేదని సీనియర్లు అంటున్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు పలువురు ఎమ్మెల్యేలకు మాత్రం నెగెటివ్ మార్కులు వేశారు. శాసన సభ్యుల వ్యవహార శైలి సరిగా లేకపోవడంతో పాటు.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.

నిజానికి ఏప్రిల్ లేదంటే ..మే నెలల్లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి బావిస్తున్నారని సమాచారం. సర్వే ఫలితాల ప్రకారం...ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో వ్యతిరేక ఫలితాలు వచ్చిన ఎమ్మెల్యేల పనితీరును మెరుగు పరుచుకునేందుకు చివరి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ఎల్పీ సమావేశం వేదికగా సీఎం వారికి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలకు ఇదే చివరి అవకాశమనీ..పద్ధతి మార్చుకోకపోతే...వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రావడం కష్టమని తెగేసి చెప్పే ఛాన్సుంది.

అందుకే టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని తలచుకుని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి చేయించిన సర్వేల్లో తమకు అనుకూలంగా రిపోర్టు వచ్చిందా... వ్యతిరేకంగా వచ్చిందా..? సర్వేలో ఎన్ని మార్కులు వచ్చాయి..? ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల పట్ల సీఎం స్పందన ఎల ఉండబోతోంది..అని ప్రశ్నించుకుని శాసన సభ్యులు తెగ బీపీలు పెంచుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories