logo
తాజా వార్తలు

ఆత్మహత్య చేసుకున్న పెళ్ళైన ప్రేమజంట

ఆత్మహత్య చేసుకున్న పెళ్ళైన ప్రేమజంట
X
Highlights

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరికి పెళ్లయింది. కానీ ఇద్దరు తమ భార్య, భర్తలతో విడిపోయారు. మనసులు కలిసి మళ్ళీ...

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరికి పెళ్లయింది. కానీ ఇద్దరు తమ భార్య, భర్తలతో విడిపోయారు. మనసులు కలిసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో చావే శరణ్యమనుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్ళైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఉంగుటూరు గ్రామానికి చెందిన నంద్యాల సురేష్‌(27) తన భార్యతో, జొన్నాడ ఉమా సరోజిని(23) తన భర్తతో ఘర్షణ పడి వేర్వేరుగా సొంత ఊరిలోనే ఉంటున్నారు. ఒకే వీధి, పైగా ఇద్దరికీ తోడు లేకపోవడంతో వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి మందలించారు. కానీ వారు తమ పద్దతిని మార్చుకోలేదు. ఈ క్రమంలో సరోజినిని సురేష్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దానికి వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన వీరు గురువారం రాత్రి స్థానికంగా ఉండే చిన్న పాకలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story