రెడ్ మీ.. మైక్రోమాక్స్ మధ్య మార్కెట్ వార్

రెడ్ మీ.. మైక్రోమాక్స్ మధ్య మార్కెట్ వార్
x
Highlights

పోటీ పెరుగుతున్నా కొద్దీ.. మొబైల్ యూజర్లకు కంపెనీలు తక్కువ ధరలకే కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో.. రెడ్ మీ సంస్థ ఇప్పుడు భారత మొబైల్...

పోటీ పెరుగుతున్నా కొద్దీ.. మొబైల్ యూజర్లకు కంపెనీలు తక్కువ ధరలకే కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో.. రెడ్ మీ సంస్థ ఇప్పుడు భారత మొబైల్ మార్కెట్ ను బడ్జెట్ ఫోన్లతో శాసిస్తున్న మాట నిజం. అందుకే.. ఇతర కంపెనీలు కూడా.. తక్కువ ధరలకే మరింత మెరుగైన ఫీచర్లు అందిస్తూ.. ఫోన్లను విడుదల చేస్తున్నాయి. రెడ్ మీ 5 మొబైల్ లాంచ్ అయిన రోజే.. లోకల్ సంస్థ మైక్రో మాక్స్.. భారత్ 5 ప్రో పేరుతో కొత్త మోడల్ ను పోటీగా రిలీజ్ చేసింది.

రెడ్ మీ 5 ధర.. 7 వేల 999 రూపాయలు అయితే.. భారత్ 5 ప్రో ధర కూడా 7 వేల 999 రూపాయలుగా ఫిక్స్ చేశారు. పైగా.. ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మైక్రోమాక్స్ భారత్ 5 ప్రో మొబైల్ లో.. 5.2 అంగుళాల స్క్రీన్, 1.3 గగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్.. 3 జీబీ ర్యామ్.. 32 జీబీ రోమ్.. అంతర్గత స్టోరేజీ సామర్థ్యం పెంచుకునే వెసులుబాటు.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా.. 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు.. ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి.

అలాగే.. పానాసోనిక్ నుంచి కూడా ఇలాంటి మోడల్ రిలీజ్ అయ్యింది. ఇలా.. ఫోన్ల ధరలు భారీగా తగ్గుతుండడం.. అందుబాటు ధరల్లో మెరుగైన ఫీచర్లతో ఫోన్లు లభిస్తుండడంతో.. మొబైల్ లవర్లు కూడా భారీగానే కొనుగోళ్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories