మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
x
Highlights

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు అజ్ఞాతం వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ...

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు అజ్ఞాతం వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ టాప్‌కేడర్‌లో ఉన్న కొట్టి పురుషోత్తం, వినోదిని దంపతులు మంగళవారం హైదరాబాద్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు.దాదాపు ముప్పైఏళ్ళకు పైగా వీరు మావోయిస్టు పార్టీలో ఉన్నారు. అనారోగ్య కారణాలు, మావోయిస్టు పార్టీపై అనాసక్తితో వీరు లొంగిపోయారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కాగా మావోయిస్టు పార్టీకి వీరి లొంగుబాటు పెద్ద లోటని అంజనీకుమార్‌ అన్నారు. లొంగిపోయే ప్రతి మావోయిస్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి, స్వయం ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ప్రాంతీయ కమిటీ.. ప్రచార కమిటీ, కేంద్ర కమిటీల్లో వివిధ హోదాల్లో వారు పనిచేశారని అయన తెలిపారు. 1981లో పీపుల్స్‌వార్‌లో చేరిన పురుషోత్తం తొలుత సిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1982లో వినోదినిని పెళ్లి చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories