మ్యానిఫెస్టో ఎలా వండుతారు? ఎవరికి ఎంత వడ్డిస్తారు?

మ్యానిఫెస్టో ఎలా వండుతారు? ఎవరికి ఎంత వడ్డిస్తారు?
x
Highlights

ఒక్కో పార్టీది ఒక్కో దిక్కు. ఒక్కో సిద్దాంతం. ఒకే ఒక్క టార్గెట్‌తో ఏకమవుతామంటున్నాయి. మరి మేనిఫెస్టో మాటేంటి...ఎవరికి వారే, మ్యానిఫెస్టోలు సిద్దం...

ఒక్కో పార్టీది ఒక్కో దిక్కు. ఒక్కో సిద్దాంతం. ఒకే ఒక్క టార్గెట్‌తో ఏకమవుతామంటున్నాయి. మరి మేనిఫెస్టో మాటేంటి...ఎవరికి వారే, మ్యానిఫెస్టోలు సిద్దం చేస్తున్నామంటున్న పార్టీలు, వాటితోనే జనంలోకి వెళ్తే గందరగోళం తలెత్తదా...అందుకే ఉమ్మడి మ్యానిఫెస్టోకి రూపకల్పన చేస్తున్నామంటున్నాయి మహాకూటమి పార్టీలు. అమరవీరుల ఆశయ ఎజెండా, ప్రజా కూటమి, గెలిచేవారికే సీట్లు ఈ మూడు అంశాల ప్రాధాన్యంగా మహాకూటమి ముందుకెళ్తుందని తెలుస్తోంది. అమరవీరుల ఆశయాలే ఉమ్మడి అజెండాగా మహాకూటమి అడుగులు వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ అంశంలో చాలా సీరియస్ గా ముందుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం, ఉద్యోగ కల్పన వాటి సాధ్యాసాధ్యాలపై కూలంకశంగా కూటమిలో చర్చించనున్నారు.

ప్రజలు ఏం కోరుకుంటున్నారో....ఏం కావాలనుకుంటున్నారో వాటిని సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కూటమి కోసం ఉమ్మడి ఏజెండాను ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయో...ఆయా పార్టీలన్నీ కలిపి ఒక ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కూటమిలో ఉండే ఒక్కో పార్టీ ఒక్కో ఏజెండాతో, ఒక్కో మ్యానిఫెస్టోతో వెళితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే, ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే కాంగ్రెస్ ఇప్పటికే అనేక ఎన్నికల వాగ్ధానాలు ప్రకటించింది. నిరుద్యోగ భృతి, రైతులకు రెట్టింపు బీమా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వ్యయం, ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ట వరకు ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మీ, బంగారు తల్లి పథకం పునరుద్దరణ, ఇలా కేసీఆర్‌ ఏవైతే పథకాలు అమలు చేస్తున్నారో వాటికి పోటీ అన్నట్టుగా అన్నింటికీ రెట్టింపు ఇస్తామని చెబుతున్నారు. మరి ఇవన్నీ ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఉంటాయా అన్నది ప్రశ్న. సిద్దాంతాల రిత్యా వైరుధ్యమున్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో ఉమ్మడి మ్యానిఫెస్టో సాధ్యమేనా....అన్నది మరో సంశయం. అయితే, ఉమ్మడి ఎన్నికల ప్రణాళికతోనే ఎన్నికలకు వెళ్తే మంచిదని మహాకూటమి నేతలు భావిస్తున్నారు. చూడాలి, ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా వండి వారుస్తారో.

Show Full Article
Print Article
Next Story
More Stories