logo
తాజా వార్తలు

హిజ్రా గొంతుకోసి పరారైన ప్రియుడు

హిజ్రా గొంతుకోసి పరారైన ప్రియుడు
X
Highlights

హిజ్రాతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. హిజ్రాపై దారుణానికి పాల్పడ్డాడు. గొంతుకోసి పరారయ్యాడు. ఈ...

హిజ్రాతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. హిజ్రాపై దారుణానికి పాల్పడ్డాడు. గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ లో జరిగింది. గార్ల మండలం అంజనాపురానికి చెందిన బానోత్‌ రాధిక (హిజ్రా), కొత్తతండాకు చెందిన దారావత్‌ సురేశ్‌ మహబూబాబాద్ లోని రాధిక అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. వీరు మూడేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. అయితే సంవత్సరం కిందట రాధిక కట్నం పేరుతో రూ. 2 లక్షలు సురేష్ కు ఇచ్చింది. దాంతో సంతృప్తిపడని సురేష్ మరో మూడు లక్షలు కావాలని రాధికను వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి గొడవ తీవ్రమైంది. కోపోద్రిక్తుడైన సురేష్.. రాధిక గొంతుకోసి పరారయ్యాడు. ఇరుగుపొరుగువారు రాధికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story