Top
logo

నా భార్యను తమ్ముడికి ఇచ్చి పెళ్లిచేయండి...

నా భార్యను తమ్ముడికి ఇచ్చి పెళ్లిచేయండి...
X
Highlights

సోమవారం నాడు వివాహం చేసుకుని, 24 గంటలు గడవకుండానే ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు తన భార్యను తమ్ముడికి ఇచ్చి...

సోమవారం నాడు వివాహం చేసుకుని, 24 గంటలు గడవకుండానే ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు తన భార్యను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని లేఖ రాసిన ఘటన బెంగళూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో మునిరాజు (30) అనే యువకుడికి, ఆయన అక్క కూతురితో బంధుమిత్రులు వైభవంగా పెళ్లి జరిపించారు. వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం రాత్రి వారికి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ సమయంలో భార్యతో అన్యమనస్కుడిగానే ఉన్నాడట. మంగళవారం వేకువ జామున మరో గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేనప్పటికీ బలవంతంగా వివాహం చేశారని- ఆమెను తన సోదరుడికే ఇచ్చి వివాహం చేయాలని రాసిన ఉత్తరాన్ని చిక్కబళ్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు స్వాధీనపరచుకున్నారు.

Next Story