logo
జాతీయం

బీజేపీ ఎమ్మెల్యేకు చెప్పుల దండతో స్వాగతం..

X
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల...

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన బీజేపీ అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. దీంతో వెంటనే సదరు ఎమ్మెల్యేతోపాటు పక్కనే మరో కార్యకర్త కూడా ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నగాడాలో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ షెకావత్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం ఆ పార్టీ నేతలను షాక్‌కు గురి చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి.

Next Story