భార్య పరీక్షకు వచ్చి అనంతలోకాలకు వెళ్లిన భర్త!

భార్య పరీక్షకు వచ్చి అనంతలోకాలకు వెళ్లిన భర్త!
x
Highlights

భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్ష రాయించేందుకు, రేణిగుంట సమీపంలోని ఓ పరీక్ష కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్న ఓ వ్యక్తి గుండెపోటుతో...

భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్ష రాయించేందుకు, రేణిగుంట సమీపంలోని ఓ పరీక్ష కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. మంగళవారం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్‌(33), భార్య సరితకు టెట్‌ ఆన్‌లైన్‌ అర్హత పరీక్ష ఉంది. దీంతో వారు తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇంతలో పరీక్షకు వేళ అవడంతో సరితకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన ప్రభాకర్ పరిసరాల్లో కూర్చున్నాడు. ఈక్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు.పరీక్ష అవ్వగానే బయటికి వచ్చిన సరిత భర్త విగతజీవిగా పడిఉండటాన్ని హతాశురాలైనది. దీంతో తీవ్రంగా రోదించింది. ఆమె పరిస్థితిని చూసిన స్థానికులు రోధించారు. భర్త చనిపోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నామ్ చెయ్యడంతో ఆమెను వారించారు. కాగా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.ప్రభాకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories