బావమరిదిని హత్య చేసిన భావ..

బావమరిదిని హత్య చేసిన భావ..
x
Highlights

విజయవాడలో పట్టపగలే దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని సొంత బావే హత్య చేశాడు. BRTS రోడ్ లోకో పైలట్‌ ట్రైనింగ్‌ కాలేజీ సమీపంలో జరిగిన ఈ హత్య...

విజయవాడలో పట్టపగలే దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని సొంత బావే హత్య చేశాడు. BRTS రోడ్ లోకో పైలట్‌ ట్రైనింగ్‌ కాలేజీ సమీపంలో జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల చదలవాడ రాజు అనే వ్యక్తి గేట్‌మన్‌ ట్రైనింగ్ కోసం సిటీకి వచ్చాడు. ఈ క్రమంలో అతన్ని ఫాలో అయిన ఇద్దరు వ్యక్తులు.. కత్తితో పొడిచి బైక్‌పై పరార్‌ అయ్యారు. కత్తిపోట్లకు గురైన రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. కాగా మృతుడి సొంత చెల్లెలి భర్త శేఖర్ మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్థుతం దర్యాప్తు జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories